CTR: మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అబద్ధపు హామీలను గుర్తించి అధికారంలోకి వచ్చారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఆరోపించారు. పుంగనూరు గోకుల్ సర్కిల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని మానవహారం ఏర్పాటు చేశారు. యువ గళంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం మరిచిపోయిందని తెలిపారు. ప్రైవేటీకరణతో తీరని అన్యాయం జరుగుతుందన్నారు.