ప్రకాశం: ఒంగోలులో మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈగల్ టీం సీఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అనర్ధాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకులు సాయంత్రం గుమికూడె ప్రదేశాలను గుర్తించి పోలీసులు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మహబూబ్ బాషా, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.