W.G: ప్రకృతి వ్యవసాయంతో పండించే కూరగాయలు, ఆకుకూరలు తినడంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఉండి కేవీకే ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎన్. దెబోరా మెస్సినా సో అన్నారు. మంగళవారం చిట్టవరం గ్రామలలో ఆమె పర్యటించారు. మహిళలకు కూరగాయలు, పండ్లు మొక్కలను అందించి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రజలలో అవగాహన కల్పించి చైతన్యం తీసుకు రావాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు.