SKLM: మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆముదాలవలస MLA, రాష్ట్ర పియుసి ఛైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో యాంటీ డ్రగ్స్ పై సైకిల్ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.