TG: మూసీని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్‌దే అని KTR విమర్శించారు. గతంలో చేసిన ఆ తప్పుకు కాంగ్రెస్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మూసీలోకి వచ్చే మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి పంపించినట్లు KTR తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టు వల్ల వేలాది మంది పేదల జీవితాలు ఆగమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.