TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే.. ‘మింగటానికి మెతుకు లేదు కానీ, మీసాలకు సంపంగి నూనె’ అన్న సామెత గుర్తుకొస్తోందని KTR విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న వాటికి డబ్బులు లేవు కానీ, అందాల పోటీలకు రూ. 200 కోట్లు, మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు రూ.100 కోట్లు ఉన్నాయా? అంటూ మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లైనా కట్టారా? అని నిలదీశారు.