SRPT: జిల్లా కేంద్రానికి చెందిన, హైకోర్టు లాయర్ మహమ్మద్ బడే సాహెబ్(45) శనివారం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు. విధుల నిర్వహణలో భాగంగా హైదరాబాదులో ఉంటున్న బడే సాహెబ్ అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో బంధువులు హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేనికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.