ELR: జిల్లాలో ఏఎస్సై పదోన్నతుల వ్యవహారంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ను తప్పుదారి పట్టించేందుకు యత్నించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదోన్నతుల కోసం సమర్పించిన వినతిపత్రంలో మరో సహోద్యోగి సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసినట్లు ఎస్పీ గుర్తించారు. దీనిపై స్పందించిన ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.