TG: మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే, సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలగొడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాధితుల రోదనలు సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? అని ఆయన నిలదీశారు. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.