AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మార్చి 5న జరిగిన పెళ్లికి రాలేకపోయిన ఆయన, ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.