TG: BRS హయాంలో జరిగిన మూసీ అభివృద్ధిపై మాజీ మంత్రి KTR పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. KCR పాలనలో మూసీ ప్రక్షాళన కోసం ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూనే, లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్ట్ చేపడతామనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అసలు నిధులు లేనప్పుడు ఇంత భారీ ప్రాజెక్టుకు నిధులు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు.