ADB: ఇచ్చోడ మండలం ముక్రా గ్రామ సర్పంచ్ ఖాతున్ ఖదీర్ మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావును మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచిగా గెలిచిన ఆయనను మాజీ ఎంపీ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు.