KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచులు అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హితవు పలికారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఇవాళ ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.