VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన PGRSలో ప్రజల నుంచి 185 వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 60, DRDA–32, జిల్లా పంచాయితీ–18, హౌసింగ్–10, ఇతర శాఖల నుంచి 42 వినతులు ఉన్నాయి. వినతులపై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.