వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై లాయర్లు ప్రస్తావించగా.. ఈనెల 17న త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని సీజేఐ తెలిపారు. కోర్టు ఆదేశాలు ఇస్తే తప్ప రాష్ట్రాలు కాలుష్య నివారణ చర్యలు అమలు చేయవని అమికస్ క్యూరీ అపరాజిత సిన్హా వాపోయారు. దీనిపై స్పందించిన సీజేఐ.. కచ్చితంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు.