MNCL: జన్నారం మండలంలోని కామన్పల్లి గ్రామ హ్యాట్రిక్ సర్పంచ్ పెరం శ్రీనివాస్‌ను BRS జన్నారం మండల, పట్టణ నాయకులు సన్మానించారు. శ్రీనివాస్ తల్లి శంకరవ్వ, భార్య మానస శ్రీనివాస్ గతంలో సర్పంచులుగా పని చేశారు. ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీనివాస్ మరోసారి సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.