NGKL: బిజినపల్లి మండలం పాలెం గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బోనాసి రామకృష్ణ సోమవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నూతన సర్పంచ్ రామకృష్ణను శాలువాతో కప్పి సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.