NGKL: పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని అర్చకులు వరదరాజన్ అయ్యగారు తెలిపారు. జనవరి 14వరకు జరిగే ఈ పూజలలో ప్రతిరోజు సుప్రభాతసేవ, ఆరాధన, సామూహిక కుంకుమార్చనలు, గోదామాధకు పుష్పాభిషేకం, భక్తుల గోత్రనామాలతో అర్చనలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.