NRPT: నర్వలో సోమవారం జరిగిన స్థానిక ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంత్రి వాకిటి శ్రీహరి గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. కల్యాల, సిపూర్, రాయికోడ్, రాజుపల్లి, ఉందేకోడ్ గ్రామాల్లో పర్యటించి ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.