MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామ ఉపసర్పంచ్గా నింగరమైన లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని 12 వార్డుల్లో లలిత నాలుగో వార్డు సభ్యురాలిగా విజయం సాధించారు. ఆదివారం రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో 11 మంది వార్డు సభ్యులు ఆమెకు మద్దతు తెలపడంతో లలిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.