NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు, పోలింగ్లో రిగ్గింగ్ జరిగిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రుద్రారపు భిక్షపతి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.