ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పర్సేఘడ్ పరిధిలో మందుపాతర పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కోబ్రా బెటాలియన్ జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన ఇద్దరు జవాన్లను రాయపూర్ ఆస్పత్రికి తరలించగా వారికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.