VZM: చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం సమర్పించింది. అక్రిడిటేషన్ సంఖ్య పెంపు, ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్నప్పటికీ జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు, క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.