ఖమ్మం జిల్లాలో జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 6 మండలంలో మొత్తం 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ-117, BRS-40, CPI-04, CPM-14, TDP-1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. కాగా, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి.