KKD: ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి వైపు నడిపించడమే ప్రభుత్వం ప్రదాన ఉద్దేశం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో ప్రధాన మంత్రి ఉజ్వల ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజప్ప పాల్గొన్నారు. సంక్షేమ సంస్కరణ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.