W.G: కరుణ, సహనం, మానవత్వానికి దిక్సూచి క్రీస్తు అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని ఏసుక్రీస్తు ప్రేమాలయం ప్రార్ధన మందిరంలో 3 రోజులపాటు జరిగే క్రిస్మస్ 27వ వార్షిక పండుగల్లో సోమవారం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఏసుక్రీస్తు ప్రపంచానికి వెలుగుగా ఉన్నారని, ఆయన బోధించిన మానవతా విలువలను పాటించాలన్నారు.