SRD: మంచినీళ్లు సరిగా రావడం లేదని ఆరోపిస్తూ ఆదిత్య నగర్ కాలనీవాసులు సంగారెడ్డిలోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలనీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పది రోజులుగా నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.