MLG: మేడారం మహా జాతర సమీపిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు జరుగుతుండటంతో శాంతిభద్రతల రక్షణకు SI శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కీలక ప్రాంతాల్లో మోహరించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.