VSP: విశాఖలోని అల్లిపురం జంక్షన్లో బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు అదుపు తప్పి అక్కడ ప్రయాణిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి, వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.