E.G: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19న రాజమండ్రిలో పర్యటించనున్నారు. లోకేష్ పర్యటన ఖరారు కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పర్యటన ఖరారు కావడంతో నగరం పసుపు తోరణాలతో కళకళలాడుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.