KRNL: మద్దికేర ఎస్సైగా కుమారి హరిత బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చేస్తానన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై విజయ్ కుమార్ నాయక్ పత్తికొండకు బదిలీపై వెళ్లారు.