ATP: రాయదుర్గంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేళాలో అర్హులైన నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7801031771 నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.