ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ సిబ్బందిలో 50 శాతం మందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలి. అత్యవసర సేవల విభాగాలకు మినహాయింపు ఉంటుంది. గతంలో 16 రోజులు GRAP-3 నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి కారణంగా ప్రభావితమైన కార్మికులకు రూ.10వేలు పరిహారం ఇస్తాం’ అని పేర్కొంది.