VZM: బాడంగి మండలం బొత్సవాని వలస పంచాయతీ గదబవలసలో ఆదివారం వరి పంట అగ్నికి కాలిపోయిన నేపథ్యంలో ఇవాళ బొబ్బిలి MLA బేబీ నాయన అక్కడకు వెళ్లి బాధితురాలు గొర్లె లక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. చేతికి వచ్చిన పంట ఇలా కలిపోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయంగా కొంత నగదును ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.