కడప: దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్య నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.