ATP: ఎన్జీవోల ఫోరం సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో జనవరి 8, 9, 10 తేదీల్లో అనంతపురంలో ‘మిల్లెట్ మేళా’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను సోమవారం కలెక్టర్ ఆనంద్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. మిల్లెట్లు, తృణధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ మేళా ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.