TG: టెట్ పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి జనవరి 20, 2026 వరకు నిర్వహించనుంది. పరీక్షలు ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు.