EG: ధవళేశ్వరానికి చెందిన అర్జి బాలకృష్ణ మున్సిపాలిటీలో సిల్ట్ పనులు చేసుకుంటూనే, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటాడు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బాలకృష్ణను కమిషనర్ ఘనంగా సన్మానించారు. కమిషనర్ మాట్లాడుతూ.. బాలకృష్ణ 74 కేజీల విభాగం స్క్వాడ్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.