కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలోని రేషన్ దుకాణాల్లో ఈ నెల 18 గురువారం వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు తహశీల్దార్ ముజీబ్ తెలిపారు. ఈ నెల 15 వరకు పంపిణీ ఉండగా మరో మూడు రోజులు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో రేషన్ బియ్యం తీసుకోవాలని ఆయన సూచించారు.