HYD: ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడ్తల్ మహేశ్వర పిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పత్రీజీ ధ్యాన మహాయాగం-4 నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ది పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్ట్ ఛైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.