MHBD: జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. డోర్నకల్, కురవి, సిరోల్, కొత్తగూడ, గంగారం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు మరియు 1000 మంది సిబ్బంది పాల్గొంటారన్నారు.