VZM: గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం AITUC నేత బుగత అశోక్ ఆద్వర్యంలో శానిటేషన్ సిబ్బంది నిరసన చేపట్టారు. తమని తొలగిస్తామని సూపరింటెండెంట్, కాంట్రాక్టర్ పేర్కొనడంతో కార్మికులు పనులు నిలిపివేసి నిరసన చేపట్టారని బుగత ఆశోక్ తెలిపారు. విషయం మంత్రితో చర్చించి ఉద్యోగాలు కొనసాగిస్తామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేశామని తెలిపారు.