TG: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్కు వచ్చారు. కాసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. కాగా ఈ నెల 22వ తేదీ వరకు HYDలో ముర్ము ఉండనున్నారు.