VZM: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు అన్నారు. బుధవారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ప్రదర్శనలు ఆలోచింపచేసేలా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు విమలమ్మ, సాయి చక్రధర్, హెచ్ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.