VSP: జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురం పోస్టాఫీస్ వీధిలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలొ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షన్, హౌస్, రేషన్ సమస్యలు అధికంగా వచ్చాయన్నారు. అలాగే వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.