TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, మెడిసిన్ స్టోర్, వ్యాక్సిన్ నిల్వ గది, లేబర్ రూం, వార్డులను పరిశీలించి వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందని,సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.