కరీంనగర్ జిల్లాలో మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 గ్రామాలలో సర్పంచ్ స్థానాలకు 454 మంది, 1034 వార్డులకు ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో మొత్తం 5 మండలాలలో 1,59,647 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.