ICC తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో మంధాన చేసిన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 790 రేటింగ్ పాయింట్లతో స్మృతి నెం.1 ర్యాంక్‌లో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (782)ను రెండో స్థానంలో నిలిచింది.