AP: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడంతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమెరికా నుంచి గుంటూరుకు బయలు దేరిన వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. తన భార్య, కోడలు, 9 నెలల మనవడు మూడు రోజులుగా చిక్కుకుపోయారని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు.