సంజూ శాంసన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. ‘శాంసన్ 14 ఏళ్ల వయసులో తిరువనంతపురంలోని ఒక క్లబ్ తరపున ఆడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి నేను అతని కెరీర్‌ను నిశితంగా గమనిస్తున్నాను’ అని థరూర్ తెలిపారు. సంజూకు తాను వీరాభిమానినని ఆయన పేర్కొన్నారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సంజుకు జట్టులో ఎప్పుడూ సుదీర్ఘమైన అవకాశాలు లభించలేదన్నారు.